Header Banner

కేబినెట్ లోకి నాగబాబు, బీజేపీకి మరో బెర్తు! ఆ ముగ్గురూ ఔట్!

  Tue May 06, 2025 21:23        Politics

 

ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై మరియు కూటమి ప్రభుత్వంపై ఆసక్తికర కథనాలు వివిధ మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దాని యొక్క నిజా నిజాలు ఎంతవరకు నమ్మసక్యమో తెలియాల్సి ఉంది.

 

కొత్త మంత్రులుగా
ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో కడప వేదిక గా టీడీపీ మహానాడు జరగనుంది. ఆ తరువాత జూన్ 12 నాటికి ప్రభుత్వం ఏర్పాటై తొలి ఏడాది పూర్తి కానుంది. ఈ సమయంలోనే పాలనా పరంగా కీలక నిర్ణయాలకు చంద్రబాబు సిద్దం అయ్యేలా ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు. మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవటం పైన చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో, నాగబాబుకు మంత్రి పదవి వేళ.. బీజేపీ నుంచి మరో మంత్రి పదవి కోసం ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. సామాజిక సమీకరణా లను పరిగణలోకి తీసుకొని బీజేపీ నుంచి అభ్యర్ధిని ఫైనల్ చేయనున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!


బీజేపీకి మరో మంత్రి పదవి
కేంద్ర కేబినెట్ లో ఏపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఏపీ కేబినెట్ లోనూ బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉండాలనే చర్చ తెర మీదకు వచ్చింది. అందులో భాగంగా బీజేపీ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన పైన చర్చ జరుగుతున్న ట్లు కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. నాగబాబు ఎంట్రీతో మంత్రులుగా జనసేనకు నాలుగు పదవులు దక్కుతున్నాయి. దీంతో, ఇప్పుడు బీజేపీకి మరో స్థానం కేటాయించాల్సి వచ్చిందనేది పార్టీ నేతల సమాచారం. ఈ కారణంగానే నాగబాబు చేరిక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, పాటుగా మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఇద్దరు మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

 

ఛాన్స్ దక్కేదెవరికి
ప్రస్తుత మంత్రుల్లో కొందరి పని తీరు పైన సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీ కేబినెట్ భేటీలోనూ మంత్రులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తున్నారు. అయినా, కొందరు మంత్రులు చొరవ చూపకపోవటం పైన చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా కొందరు మంత్రుల వ్యవహార శైలి పైన ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా మంత్రుల తో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో వారి పని తీరును వివరిస్తూనే.. మారకుంటే మార్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో, గోదావరి జిల్లాలతో పాటుగా, ఉత్తరాంధ్ర.. కోస్తా జిల్లాల నుంచి ముగ్గురి మంత్రులపై వేటు పడే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. దీంతో.. మంత్రివర్గంలో మార్పులు - చేర్పుల పైన చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #Nagababu #BJP #APPolitics #TDP #JanaSena #APCabinet #Chandrababu